సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రస్తుతం విశాఖపట్నం -సికింద్రాబాద్ల మధ్య రెండు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే పెరుగుతున్న ప్రయాణ డిమాండ్కు అనుగుణంగా సికింద్రాబాద్ – విశాఖపట్నం – సికింద్రాబాద్ వందేభారత్ రైలుకు(20707 /20708)అదనంగా మరో స్టాప్ ఏర్పాటు చేశారు. ఇక నుంచి నేటి ఆదివారం 25వ తేదీ నుండి రైలు ఏలూరులో కూడా ఆగనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వివరాలను వెల్లడింల్లచింది. ఈ రైలు ఏలూరుకు చేరుకునే టైమింగ్స్ గురించి తెలుసుకుందాం.. ఈ రైలు గురువారం మినహా వారంలో ఆరు రోజుల పాటు రాకపోకలు సాగిస్తుంది. ఈ రైలు ప్రతి రోజు ఉదయం సికింద్రాబాద్ నుంచి ఉదయం 5.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.50 గంటలకు విశాఖపట్నంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యా హ్నం 2.35 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి రాత్రి 11.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ వందేభారత్ ఉదయం 9.05 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 9.10 గంటలకు బయలుదేరి ఉదయం 9.49 గంటలకు ఏలూరుకు చేరుకుని.. ఒక నిమిషం పాటు అక్కడ హోల్డ్ అవుతుంది. మరి ఎప్పటి నుండో డిమాండ్ లో ఉన్న తాడేపల్లి గూడెం స్టేషన్ లో మాత్రం హోల్డ్ ఇవ్వడం ఇంకా ఇవ్వక పోవడం దురదృష్టకరం.
