సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అచ్యుతాపురం సెజ్ బాధితులకు వైసీపీ పార్టీ తరపున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, చప్పున గాయపడ్డవాడ్డ రికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని MLC బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం లో ఉన్నమంత్రులు బాధ్యతతో మాట్లాడాలని ,18 మంది చనిపోయి ఇంత ఘోర ప్రమాదం జరిగితే అధికారంలో ఉన్నవాళ్లు పట్టించు కోలేదన్నారు. వెంటనే వచ్చి కనీసం బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పలేదని ఆయన దుయ్యబట్టారు. ఆ పార్మా కంపెనీ ఫై అడిట్ చేసే దైర్యం కూడా చెయ్యలేదని, పైగా దర్యాప్తు చేస్తే కంపెనీలు వెళ్ళిపోతాయని ప్రతి పక్షం విమర్శిస్తుందని అన్నారని, ( పవన్ నుద్దేశించి) విషాదం వేళ.. రాజకీయం ఎందుకు? వెంటనే సేఫ్టీ ఆడిట్ జరపాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండాచూడాలి’’ అని బొత్స పేర్కొ న్నారు. గతంలో మా వైసీపీ హయాంలో మేము ‘ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగిన వెంటనే ఘటన స్థలాస్థ నికి చేరుకున్నాము. మృతిచెం దిన వారికి కోటి రూపాయల చెక్కు అందించాము. అప్పటికప్పుడు 30 కోట్లు సిద్ధం చేశాము. తెల్లవాల్ల రు జామున జరిగిన కూడా ఎక్కడ సహాయక చర్యలు ఆగలేదు. కరోనా సమయంలో కూడా సహాయక చర్యలు ఆగలేదు. స్థాయిమరిచి కొంతమంది నేతలు విమర్శలు చేస్తున్నారు. వాటిని ప్రజలు గమనిస్తున్నారు. అచ్యుతాపురం బాధితులను పరామర్శించడానికి చంద్రబాబు ఎందుకు రాలేదని మేము ప్రశ్నించబట్టి సీఎం కేజీహెచ్కు వచ్చారు. ఒక మంచి నీళ్లు బాటిల్ కూడా బాధితులకు ఇవ్వలేదు. ఇప్పటికి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక సాయం అందలేదు అని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *