సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: న్యూ ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు విజయవంతంగా నిర్వహించినందుకు ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ అభినందనలు తెలిపారు. ప్రపంచంలో అన్ని దేశాలు సమానమే అని అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలు అన్ని దేశాలకు సమానంగా వర్తిస్తాయని స్పష్టం చేశారు. అయితే, ప్రపంచ వ్యాప్తంగా కొన్ని పశ్చిమ దేశాల నియంతృత్వ పోకడలకు అభివృద్ధి చెందుతున్న దేశాల బ్రిక్స్ కూటమి గ్లోబల్ సౌత్ అభివృద్ధే సమాధానమని వ్యాఖ్యానించారు. బ్రిక్స్ దేశాలు తమ మధ్య ఐక్యత, సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు.అయితే, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆతిథ్యమిచ్చిన బ్రిక్స్ గాలా డిన్నర్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరుకాలేదు. ఈ విందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో పాటు పలు దేశాల నేతలు హాజరయ్యారు. అయితే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాత్రం రాలేదు. నేడు, ఆదివారం, బ్రిక్స్ సమావేశాలను విజయవంతం చేసినందుకు వివిధ దేశాలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు ప్రజల జీవితాల్లో మేలిమార్పులు తీసుకొచ్చేలా న్యూఢిల్లీ డిక్లరేషన్ లక్ష్యాలను సాకారం చేసుకునేందుకు ముందుకు సాగాలని అన్నారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ పరస్పర విరుద్ధం కాదని, సమస్యలను పరిష్కరించే ఓ వ్యవస్థగా బ్రిక్స్ కూటమి మారిందన్న నమ్మకం తాజా సమావేశాలు కలిగించాయని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *