సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కడప నగరంలోని ఇప్పటి వరకు ఆల్మాస్ పేట సర్కిల్ పేరు ను టిప్పు సుల్తాన్ సర్కిల్‌ గా మార్చాలని ఒక వర్గం ప్రయత్నించగా ఆ మార్పు వ్యవహారం శనేడు శనివారం నగరంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ వివాదంతో ఆల్మాస్ పేట ప్రాంతం ఒక్కసారిగా రణరంగంగా మారింది. ఇరువర్గాల మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని పోటాపోటీగా ఆందోళనలు చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆల్మాస్ పేట సర్కిల్‌కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ తదితర హిందూ సంగాల వారు, దానిని హనుమాన్ సర్కిల్‌ గా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, టిప్పు సుల్తాన్ పేరునే కొనసాగించాలని,బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన దేశభక్తుడని ముస్లీమ్స్ సంఘాలకు చెందిన కొందరు పట్టుబడుతున్నారు. గత్ చరిత్ర నేపథ్యంలో టిప్పు సుల్తాన్ ఈ ప్రాంతాన్ని చక్కగా పాలించారని అందుకు ఆయన పేరు పెట్టడం సమంజసం అని వారు వాదిస్తున్నారు. టిప్పు సుల్తాన్ హిందూ వ్యతిరేక పాలకుడని, అటువంటి వ్యక్తి పేరును ప్రజా ప్రదేశాలకు పెట్టడం సరికాదని బీజేపీ వర్గం వారు వాదిస్తున్నారు. మరోవైపు, ఈ క్రమంలో ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ, రాళ్ళూ విసురుకొంటూ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత దాడుల స్థాయికి చేరింది. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద మోహరించారు. నిరసనకారులను అదుపులోకి తీసుకుని అక్కడే పోలీసులు పికెటింగ్‌ను కొనసాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *