సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలోని కడప జిల్లాలోని రాయచోటి వద్ద నేటి ఉద‌యం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అయిదుగురు దుర్మ‌ర‌ణం చెందారు. గువ్వల చెరువు ఘాట్‌లో కారు-లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి.. దీంతో ప్ర‌మాద స్థ‌లంలోనే అయిదుగురు మ‌ర‌ణించారు.మృతుల‌లో ముగ్గురు మహిళలు, చిన్నారి కూడా ఉన్నారు. రాయచోటి నుంచి కడప వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంఘ‌ట‌న స్థ‌లానికి పోలీసులు చేరుకుని స‌హాయ కార్యక్ర‌మాల‌ను చేప‌ట్టారు.. మృతుల వివ‌రాల‌ను తెలుసుకొంటున్నారు. ఇంకా పూర్తీ స‌మాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *