సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విక్టరీ వెంకటేష్ ఎన్నికలల్లో నిలబడిన తన బంధువులును గెలిపించుకోవడానికి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న విషయం విదితమే.. తెలంగాణాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి ప్రచారం చేసి గత బుధవారం ఏలూరు జిల్లాలో కైకలూరు అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌కు మద్దతు ప్రచారం చేసారు. పశ్చిమ గోదావరి జిల్లా కు శివారులో ఉన్న కలి దిండి మండలం కలిదిండి, నుండి రోడ్డు షో ప్రారంభించి ఎస్‌.ఆర్పీ ఆగ్రహారం, సానారుద్ర వరం, కోరుకొల్లు, కైకలూరు మండలం వేమవరప్పాడు, తామ రకొల్లు, వింజరం, ఆచవరం మీదుగా కైకలూరులో రోడ్‌షో పూర్తీ చేసారు. పార్టీలకు అతీతంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున బైక్‌ ర్యాలీ చేపట్టారు. దారి పొడవున విశేషంగా తమ అభిమాన హీరోకు మహిళలు హారతులు పట్టారు. వెంకటేశ్‌ తనదైన శైలిలో అభిమానులకు అభివాదం చేస్తూ యువతను ఉత్సాహ పరుస్తూ ముందుకు సాగారు. కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాస్‌కు కమలం గుర్తుపై, వెయ్యాలని ‘కైకలూరుకు వెంకీమామ, పెళ్లికాని ప్రసాదు, తులసి, చంటి వచ్చాడు. సినిమాలే కాదు సమాజం కూడా కావాలి. మా కామినేని శ్రీను మామ అంటే నాకు ఎంతో ఇష్టం. ఒక్కసారి పిలిస్తే పలికే మనిషి. ఏ సమస్యనైనా పరిష్క రించగలిగన వ్యక్తి. ఎవరితో వివాదాలు పెట్టుకోవడం నేను చూడలేదు. కామినేనికి ఓట్లు వేస్తే కైకలూరు అభివృద్ధి పథంలో దూసుకు పోతుంది. ప్రజలందరూ మంచి వ్యక్తులను ఎన్ను కోవాలి. అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *