సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా, ఆకివీడు సమీపంలో శతాబ్దాలుగా దక్షిణ భారతదేశ వ్యాప్తంగా చరిత్ర ప్రసిద్ధి పొందిన కొల్లేటికోట శ్రీ పెద్దింట్లమ్మ జాతర మహోత్సవాలను కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, జయమంగళ వెంకటరమణ శ్రీ అమ్మవారి ప్రతీకగా ఘటాలను స్వయంగా తలపై మోస్తూ ప్రారంభించారు. ప్రతిఏటా ఫాల్గుణ ఫాడ్యమి రోజున అమ్మవారి జాతర ప్రారంభమవుతుందని ఆలయ ఈవో గోపాలరావు తెలిపారు శ్రీ పెద్దింట్లమ్మ . అమ్మవారికి ఎమ్మెల్యే దంపతులు పట్టు వస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాజగా ప్రారంభమైన వేడుకలు వచ్చే మార్చి ఏడో తేదీ వరకు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని భక్తులు అమ్మవారిని దర్శించుకొని మ్రొక్కులు చెల్లించుకోవచ్చునని తెలిపారు. మార్చి మూడో తేదీన శ్రీగోకర్ణేశ్వరస్వామికి, జలదుర్గా అమ్మవారికి కల్యాణం నిర్వహిస్తారని తెలిపారు. దేవస్థానం చైర్మన్ పులవర్తి లక్ష్మణబాబు, రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ సైదు గాయత్రి, జడ్పీటీసీ కురెళ్ళ బాబి,స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణ, తెలంగాణ జిల్లాలనుండి విశేషంగా భక్తులు తరలిరానున్నారు.
