సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది.అయితే కోనసీమలో గత 7 రోజులుగా ఇంకా లంక గ్రామాలూ గోదావరి వరదనీటిలో మునిగి ఉన్నాయి. పంట నష్టం, ఆస్థి నష్టంతో పాటు పలువురు వరద నీటిలో గల్లంతు అవుతున్నారు కూడా.. గత 3 రోజులుగా పడవల మీదనే గ్రామాలకు ప్రయాణాలు, అధికారులు బాధితులకు సాయం అందించడం జరుగుతుంది. ఈనేపథ్యంలో పి.గన్నవరం ఊడిమూడి వద్ద పడవ ప్రమాదంలో గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది. చదలవాడ విజయ్ కృష్ణ (26) ఈనెల 28వ తేదీన ఊడిమూడిలంక వరద బాధితులకు సాయం చేద్దామని వాటర్ ప్యాకెట్లు బస్తాలు తీసుకువెళ్తున్న నాటుపడవ గోదావరిలో మునిగిపోయింది. ఈ పడవలో ప్రయాణిస్తున్న విజయ్ కృష్ణ గల్లంతయ్యాడు. గత మూడు రోజులుగా విజయ్ కోసం గాలించగా… నేడు, మంగళవారం మృతదేహం లభ్యమైంది. అధికారుల నిర్లక్ష్యమే చదలవాడ విజయ్ కృష్ణను బలితీసుకుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు లంక గ్రామాల లో బోట్లలో రక్షణ కోసం ఎన్డీఆర్ఎప్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *