సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: యానాం దగ్గర అంబేద్కర్ కోనసీమ జిల్లా దర్యాలతిప్ప, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్య గోదావరిలో ఓఎన్జీసీ సంస్థ గ్యాస్ పైప్ లైన్ వేసింది. అయితే గత శుక్రవారం రాత్రి నుంచీ గ్యాస్ లీక్ కావడం ఇంతవరకూ అధికారులు దాన్ని గుర్తించకపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. నీటిని చీల్చుకుంటూ గ్యాస్ పైకి లేస్తుండటం తో అక్కడ మంటలు వ్యాప్తించే ప్రమాదం ఉందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భారీగా గ్యాస్ లీకేజీ కావడంతో అక్కడ గోదావరి జలాలు సుడులు తిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటి వరకు ఓఎన్జీసీ అధికారులు దీనిపై స్వాందించకపోవడం ఫై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *