సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అనంతపురం జిల్లాలోని రాప్తాడు హైస్కూల్లో ఒక ఉన్మాది యువకుడు తరగతి గదిలోకి చొరబడి టీచర్ పాఠాలు బోధిస్తుండగానే, విద్యార్థులు అందరు చూస్తుండగానే తాను ప్రేమించిన బాలికపై చెట్లను కట్ చేసే ఎలక్ట్రిక్ మెషిన్‌తో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆమె చెయ్యి తెగటం, ముఖానికి మెడకు వీవు ఫై తీవ్ర గాయాలు అయ్యాయి. దానితో ఆమె చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడుతూ ఉంది. అది అడ్డుకోబోయిన మరో అమ్మాయి ఫై కూడా దాడి చెయ్యడంతో ఆమెకు కూడా గాయాలు అయ్యాయి. విద్యార్థులు అందరు తీవ్ర భయకంపితులు అయ్యారు. అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది బాధితురాలిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మరోవైపు, పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఉన్మాదిని హేమంత్‌గా పోలీసులు గుర్తించారు. దాడి చేసిన నిందితుడిని ధర్మవరం రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. ప్రాధమిక సమాచారం ప్రకారం.. ఆ ఉన్మాదికి తల్లి తండ్రులు లేరని , అక్క దగ్గర పెరుగుతున్నదని వరుసకు మరదలు అయ్యే ఆ అమ్మాయిని ప్రేమించాడని అయితే ఆమె నిరాకరించడంతో ఉన్మాదిగా మారి ఈ దారుణం కి పాల్బడ్డాడని తెలుస్తుంది.
