సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అర్నబ్ తుపాను కష్టాలు నుండి భీమవరం ప్రజలు గోదావరి జిల్లాల ప్రజలు ఇంకా తేరుకోలేదు. నేడు శనివారం పట్టణంలో కాస్త హోటల్స్ మరల తెరిచారు. చాల ప్రాంతాలలో ప్రజలు తిండి తిప్పలు లేకపోయినా కరెంట్ కూడా లేకపోవడంతో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. భీమవరం పరిసర గ్రామాలలో ఇంకా విద్యుత్తూ సరఫరా పునరుద్దరించవల్సి ఉంది. పట్టణంలో కూడా తరుచు కరెంట్ సరఫరా నిలిచిపోతూ మరల వస్తుందో మొన్నటిలా 4 రోజులు ఆగిపోతుందో అన్న భయం ప్రజలలో ఇంకా పోలేదు. దీనికి తోడు మీ కష్టాలు ఇంకా తీరలేదు అన్నట్లు బంగాళా ఖాతంలో అల్పపీడనం ప్రభావంతో గోదావరి జిల్లాలలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో.. భీమవరం లో నేటి శనివారం మధ్యాహ్నం నుండి ఒక్కసారిగా ఆకాశం కారు చీకట్లు కమ్ముకొంటు వర్షం విరుచుకొని పడింది. నేటి రాత్రి వరకు కొనసాగే అవకాశం కనపడుతుంది. అల్ప పీడన ప్రభావం వాయిగుండంగా మారితే మాత్రం మరో 3 రోజులు కొనసాగే అవకాశం ఉంది.
