సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వేసవి కాలం వచ్చేస్తుంది అయితే..గత 3 రోజులుగా భీమవరం తో సహా కోస్తా ఆంధ్ర లో పలు జిల్లాలలో రాత్రిళ్ళు నుండి ఉదయం 9 గంటల వరకు దట్టమైన పొగమంచు అల్లు కొని వృద్దులకు, పిన్నలకు , రోగులకు, రోడ్లపై వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది. భీమవరంలో నేటి గురువారం ఉదయం ఈ సీజన్ లో ఎప్పులేని విధంగా తీవ్రమైన చలిగాలులు వీచాయి. గోదావరి జిల్లాలు అంతా ఇదే తీరున ఉన్నాయి. ఉదయం 10 గంటల తరువాత గాని ఎండ రాలేదు. దీనితో రహదారి సరిగా కనిపించకపోవడంతో పలు ప్రాంతాల్లో డ్రైవర్లు వాహనాలు నిలిపివేశారు. కృష్ణ జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. గన్నవరం విమాన ఆశ్రయం లో పొగమంచు దెబ్బకు నేటి ఉదయం విమానాలు దిగకుండా అర్ధగంట పాటు ఆకాశంలోనే చెక్కరలు కొట్టాయని సమాచారం..
