సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: విచిత్రంగా నైరుతి రుతుపవనాలు వెళ్ళిపోయాక గోదావరి జిల్లాలలో వర్షాలు పడుతున్నాయి. నేడు, శుక్రవారం ఎండ దంచి కొట్టిన కూడా మధ్యాహ్నం కోనసీమ నుండి మొదలు పెడితే పాలకొల్లు, భీమవరం సమీపంలోని శృంగ వృక్షం వీరవాసరం, వరకు వర్షం పడింది. ఇదిలా ఉండగా బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు శనివారం (అక్టోబర్ 24) తీవ్రరూపం దాల్చి.. వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇది అక్టోబర్ 25 వరకు మరింత తీవ్రరూపం దాల్చి తుఫానుగా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో అక్టోబర్ 26, 27, 28, 29వ తేదీల్లో ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు ప్రకటించారు. ఈ తుఫానుకు ‘అర్నబ్’ (బెంగాళీ భాషలో మహాసముద్రం) అని నామకరణం చేసినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *