సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో మునిసిపల్ ఎన్నికలలో చంద్రబాబు ప్రభుత్వం అక్రమాలు, కుట్రలకు తెగబడుతోందన్నారు దీనిపై తమ వైసీపీ పార్టీ చేసిన ఆరోపణలు తో ఏకీభవిస్తూ సుప్రీం కోర్ట్ చంద్రబాబు సర్కార్ కు మొట్టికాయలు వేసిన ఇంకా బుద్ది రాలేదని, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ తో పాటు ఎంపీటీసీ, జడ్పీటిసి ఎన్నికలలో కూడా వైసీపీ సభ్యులు పోటీ చెయ్యకుండా నామినేషన్స్ ను అడ్డుకొంటున్నారని ఆరోపించారు. 19 మన్సిపాలిటీలలో నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని.. సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పినా సరే కేవలం మైదకూరు, తిరుపతిలో 18, కడపలో కేవలం 11 వార్డులు, రాజంపేటలో 11 వార్డులకు మాత్రమే మళ్లీ నామినేషన్ వేయడానికి అవకాశం ఇవ్వడం దారుణమన్నారు. ఎన్నికలలో అభివృద్ధి పేరు చెప్పి ఓట్లను అడిగే దమ్ము లేకే చంద్రబాబు ఎన్నికలు ను హైజాక్ చేసే అక్రమ పద్ధతులకు స్వీకారం చుట్టిందని విమర్శించారు. అయన పార్టీ గుండాలు చేస్తున్న దాడులు, మహిళా సభ్యులపై అరాచకాలు దేశం మొత్తం చూసి నివ్వెరపోతుందని అన్నారు. ఇప్పటికి . స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లకు సంబంధించి సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలను సర్కార్ తో పాటు పోలీసులు ఎన్నికల కమిషన్ కూడా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. నామినేషన్ల అంశంపై వైఎస్సార్‌సీపీ న్యాయస్థానాల్లోనే పోరాటం చేస్తుందన్నారు వైఎస్ జగన్. తమ పార్టీ అభ్యర్థుల జాబితాను SECకి, కోర్టుకు అందజేస్తామన్నారు. కోర్టుల్లోనే తేల్చుకుంటామని… దాడులు ఆపకుండా ఎన్నికలు ఎలా జరుగుతాయో చూస్తామని, జరిగిన ప్రాంతాల్లో పోలీసుల్ని బదిలీ చేయాలని. అలాగే 59మంది అధికారులపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఎన్నికల కేంద్రాల్లో సీసీ ఫుటేజ్ లైవ్ ఇవ్వాలని.. ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కుల్ని కాపాాడాలన్నారు జగన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *