సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్కిల్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు నేటితో సీఐ డి పోలీస్ అధికారుల రెండ్రోజుల విచారణ నేటి సాయంత్రం తో ముగిసింది. అయితే ఇంకా చంద్రబాబు నుండి తమకు పూర్తీ సమాచరం రాలేదని ఇంకా ఆయనను విచారించాలని, మరిన్ని రోజులు కస్టడీ కి ఇవ్వాలని అయన రిమాండ్ పొడిగించాలని సిఐడి తరపున లాయర్లు ఏసీబీ కోర్ట్ ను నేడు, ఆదివారం అభ్యర్ధించడంతో వైద్య పరీక్షల అనంతరం ACB కోర్టులో బాబును వర్చువల్గా సీఐడీ హాజరుపరచడం జరిగింది. ఇటు చంద్రబాబు తరఫు లాయర్లు వాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలు విన్నాక చంద్రబాబుకు అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్లు ఏసీబీ కోర్టు తీర్పు ప్రకటించింది. ఇవాళ ఒక్కరోజే 12 గంటలపాటు బాబును సీఐడీ అధికారుల బృందం విచారించింది.
