సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సినీ పరిశ్రమతో మంచి అనుబంధం ఉండి శిరిడిసాయి’, ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రాల నిర్మాత, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎ.మహేశ్‌రెడ్డి తనయుడు అనీశ్ హీరోగా పరిచయం చేస్తూ ‘ఇట్లు అర్జున‘ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ నటి అనశ్వర రాజన్ కథానాయికగా మహేశ్ ఉప్పల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అక్కినేని నాగార్జున సమర్పకులు. దర్శకుడు వెంకీ కుడుముల తొలిసారి నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, అఖిల్ ఈ సినిమా ప్రచారంలో పాల్గొనడం హైలైట్.. ఇక ఈ సినిమా కధ విషయానికి వస్తే..మన హీరో అర్జున్ (అనీశ్) మూగవాడు. చిన్నప్పటి నుంచి తండ్రితో పాటు దొంగ తనాలు చేస్తూ ఎదుగుతాడు. అనారోగ్యంతో మరణించిన తండ్రికి ఇచ్చిన మాట కోసం దొంగతనాలకు మానేస్తాడు. తన కింద అపార్ట్మెంట్లోనే ఉంటున్న కీర్తి (అనశ్వర రాజన్) అంటే మూగ ప్రేమ. కానీ ఆమెకు ఎప్పుడు ఎదురుపడడు. అనుకోకుండా కీర్తికి సాయం చేయడంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారుతుంది. అయితే వారిద్దరూ తమ ప్రేమను ఒకరికొకరు ఎక్స్‌ప్రెస్ చేరుకోరు. ఇదిలా ఉంటే.. పెద్దన్న (ముఖేష్‌రిషి) హైదరాబాద్ సిటీలో పెద్ద డాన్. ఆయన కొడుకు జైసల్మీర్‌లో రూ.1000 కోట్ల హవాలాకి సంబంధించిన మనీ డీల్ కోసం వెళ్లి గ్యాంగ్ వార్ లో మరణిస్తాడు. పోలీస్ అధికారి ఇరానీలకు అర్జున్‌పై అనుమానంతో కలగడంతో అతని వెంటపడతారు. అర్జున్‌కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మూగ ప్రేమికులైన అర్జున్, కీర్తి ఒకటయ్యారా? లేదా అన్నదే కథ. మరి సినిమా ఎలా తీసారని చుస్తే.. మూగవాడి ప్రేమకథకు కాస్త రొమాంటిక్ టచ్ ఇచ్చి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఫస్టాఫ్ అంతా చాల గమ్మతుగా సరదాగా సాగుతుంది. దర్శకుడు చాల మంచి టేకింగ్ అందించాడు, అయితే సెకెండాఫ్ కాస్త సాగదీసినట్లు గడబిడ మొదలవుతుంది. అయితే ఫైనల్‌గా ఇచ్చిన ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. పెద్దన్న కోటలో క్లైమాక్స్ 30 నిమిషాలు ఉత్కంఠగా సాగుతుంది. హీరోగా అనీశ్కి తొలి చిత్రంలోనే మూగవాడి పాత్రను ఛాలెంజ్ గా తీసుకుని చేశాడు. డాన్స్ ,యాక్షన్ హవభావాలను చక్కగా పండించాడు హీరోయిన్గా అనశ్వర చక్కని నటన కనబర్చింది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. పెద్దన్న పాత్ర ముఖేశ్ రిషి కి కొట్టిన పిండి. బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, గౌరి పాత్రధారి కలయరసన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మైమ్ గోపి హీరో తండ్రిగా మెరిశారు. సాంకేతిక విభాగానికి వస్తే.. కెమెరా వర్క్ నీట్‌గా ఉంది. మాటలు బాగున్నాయి. సినిమాకు రెండు పాటలు నేపథ్య సంగీతం ఎస్ఎస్ తమ హైలైట్ అని చెప్పాలి. యువతకు ఈ సినిమా నచ్చుతుంది.
