సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అల్లు వారి ‘ఆహా’ డిజిటల్ ప్లాట్ పారంపై నందమూరి బాలయ్య ‘ ఆన్ స్టాప్ పబుల్‘ ఎంతటి సంచలనం రేపిందో అందరికి తెలిసిందే.. ఇక మెగాస్టార్ వంతు వచ్చింది. ఈ నెట్ఫ్లిక్స్లో ‘మెగావర్స్’ టాక్ షో !“నవంబర్ 30న హైదరాబాద్లో గ్రాండ్ లాంచ్. కానుంది . గతంలో మా టివిలో మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి హోస్టుగా పనిచేసిన చిరంజీవి చాల కాలం తరువాత తొలిసారిగా ఓటీటీ వేదికపై సెలబ్రిటీ టాక్ షోకు పనిచేస్తూ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. “ఇప్పటికే ప్రభాస్, కమల్ హాసన్, నాగార్జున, రామ్ చరణ్, రవితేజ, నాని తదితర హీరోలతో మెగాస్టార్ ఇంటర్యూలు తో కొన్ని ఎపిసోడ్ల చిత్రీకరణ కూడా పూర్తి. చేసారు. త్వరలో అధికారిక ప్రోమో కూడా విడుదల కానుంది. ఈ షో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నవంబర్ 30న హైదరాబాద్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి
