సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయనగరం జిల్లాలోని భోగాపురం హైవేపై నేడు, మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో నలుగురు మృతి చెందారు. సుందరపేట సమీపంలోఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టడంతో అందులో ఉన్న రిలయన్స్ డిజిటల్ మేనేజర్ ఓకలపూడి శ్రీనివాస్, బోర సతీష్, శృతి, కుసుమ రంజనిగా గుర్తించారు. వీరంతా విశాఖ జిల్లా తగరపువలస పరిసర ప్రాంతాలకు చెందినవారు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల బ్యాగుల్లో నగదు, విలువైన వస్తువులను అధికారులు గుర్తించారు. ప్రమాదానికి గురైన థవేరా కారు అర్ధరాత్రి 12.50 గంటలకు శ్రీకాకుళం వైపు వెళ్లి, తిరిగి ఉదయం 7.35 గంటలకు భోగాపురం టోల్‌గేట్ దాటినట్లు రికార్డుల్లో నమోదైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *