సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో స్థానిక ఎన్నికల హీట్ మామూలుగా లేదు.దాదాపు 2న్నర ఏళ్ళ పదవి కాలం పూర్తిచేసుకొంటున్న కూటమి ప్రభుత్వం ఫై వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో? దాని ప్రభావం మిగతా 2న్నర ఏళ్ళ ప్రభుత్వ పాలనా ఫై ఎలా ఉంటుందో? అన్న టెంక్షన్ అధికార నేతలను వెంటాడుతుంది. ఓ వైపు ప్రతిపక్ష నేత జగన్ ఎక్కడికి వెళ్లిన రోడ్లన్నీ జనమే జనం.. అవన్నీ కూడా ఓట్ల రూపంలో మార్చగలిగితే మరోసారి స్థానికంగా మంచి విజయాలు సాధించి అధికార కూటమికి ప్రజా వ్యతిరేకత పేరుతొ షాక్ లు ఇవ్వాలన్నది వైసీపీ ప్యూహం.. దాన్ని అడ్డుకోవడమే కూటమి పెద్దల ప్రధాన ప్యూహం … ఇదిలా ఉండగా మరి కూటమిలో సీట్ల పంపకాలు ఇప్పటికే కుంపటి రాజేస్తున్నాయి.. జనసేన అధినేత పవన్. స్థానిక ఎన్నికలలో సార్వత్రిక (ఎమ్మెల్యే ) ఎన్నికలకు ఇచ్చినట్లు సీట్లు ఇస్తే కుదరదని ఇక తగ్గేది లేదని కుండ బ్రద్దలు కొట్టడంతో పాట , జనసేన గెలిచే సీట్లు బలాబలాపై ఒక సర్వే చెయ్యండి అని పార్టీ క్యాడర్ కు పిలుపు నివ్వడం కూటమిలో సంచలనం రేపింది. తమ పార్టీ క్షేత్ర స్థాయి నుండి ఎదుగుదలకు ఇదే మంచి సమయం అని ఈసారి సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ,తో పాటు మున్సిపల్ ఎన్నికలలో మేయర్, జడ్పీ ఛైర్మన్‌ డైరెక్ట్ ఎన్నికల్లోనూ ఎక్కవ స్థానాలలో ( కనీసం 30- 35 శాతం సీట్లు )పోటీచేసి సత్తా చాటాలని అనుకుంటోంది. ఒకవేళ జనసేన కోరిన చోట టీడీపీ టికెట్లు కేటాయించకపోతే ఫ్రెండ్లీ కంటెస్టే ఫైనల్‌ ఆప్షన్‌గా మారే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇదిలా ఉండగా మునిసిపల్ చైర్మెన్, మేయర్ లను ఎన్నికలలో డైరెక్ట్ ఓటర్లు ఎన్నుకొనే మార్పు జరుగుతుంది, కాబ్బటి 85 నుండి 90 శాతం స్థానాలలో తెలుగుదేశం అభ్యర్థులు డైరెక్టుగా పోటీ చేస్తే మంచిదని అధికారంలో ఉన్న పార్టీకే స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయని టీడీపీ ఎన్నికల పుహకర్తలు అంచనాలు వేస్తున్నారు. బీజేపీ కి కూడా సీట్లు కేటాయించాలని కేంద్రం నుండి వత్తడి ఎలానూ ఉంది. ప్రధాని మోడీ చరిష్మా తో రాష్ట్రంలో పార్టీ మరింత బలపడాలని బీజేపీ క్యాడర్ భావిస్తుంది. మరి సమయం దగ్గర పడుతుంది. ఏమి జరగనుందో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *