సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ కీలక ప్రకటన నేడు, మంగళవారం విడుదల చేసింది. స్థానిక ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఇవే, పోటీ చేసే అభ్యర్థులు వీరే అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా లిస్ట్ లు పెట్టి, జరుగుతున్న ప్రచారాన్ని జనసేన పార్టీ ఖండించింది. ఈ రకమైన ప్రచారాన్ని ఎవరూ విశ్వసించవద్దంటూ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. జనసైనికులు, వీర మహిళల పోరాట స్ఫూర్తిని, వారి ఆత్మ గౌరవాన్ని నిలిపే విధంగా జనసేన పోటీ ఉంటుందంటూ పార్టీ శాసన సభ పక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ వెల్లడించిన విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తించాలని ప్రకటనలో పేర్కొంది.
