సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల అనంతపురం అర్బన్ టీడీపీ ఎంఎల్ఏ దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ 2 ను ప్రదర్శనీయకుండా బెదిరిస్తూ చేసిన ఫోన్ కాల్ అందులో లోకేష్ నే ఎదిరిస్తాడా ?ఆ సినిమా ఆడదు .. ఆడకూడదు.. జూ ఎన్టీఆర్ లం.. కొడుకు అంటూ తీవ్ర స్థాయి బూతు పదజాలాన్ని పలుసార్లు అనడాన్ని స్థానిక విలేకరి లీక్ చెయ్యడం తో రాయలసీమ లో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర అగ్రహావేశాలు వ్యక్తం చేసి సమావేశాలు ప్రారంభించి ..ఎన్టీఆర్ కు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఆ ఎమ్మెల్యే ను వదిలేది లేదు.. అంటూ ఆయన కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే, ఫ్లెక్సీ లను చింపివేసి ఆందోళన చెయ్యడంతో అభిమానుల ఆందోళనపై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ దిగి రాక తప్పలేదు. ‘ఆ ఆడియో కాల్స్ నావి కాదు.. అంతా బోగస్’ అని బహిరంగ వీడియోలో వివరణ ఇచ్చారు. ‘నేను తొలి నుంచి నందమూరి కుటుంబానికి అభిమానిని. జూ. ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెబుతున్నా. నా ప్రమేయం లేకున్నా నాపేరు ప్రస్తావించారు.. కాబట్టి క్షమాపణలు. ఆడియో కాల్స్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేశా.’ అని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. ఈ వివాదానికి సంబంధించి తన వివరణను ఆయన వీడియో రూపంలో తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా విడుదల చేశారు.
