సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ కాంబోలో వచ్చిన జైలర్ చిత్రం సాధించిన నేపథ్యంలో సీక్వెల్ జైలర్2 ని ఈ దసరా లో నేడు, గురువారం ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? కథ ఏంటి? అన్నది ఓ సారి చుస్తే.. టైగర్ ముత్తువేల్ పాండ్యన్ (రజినీకాంత్) తన కొడుకుని తానే హత్య చేసిన విషయాన్ని ఇంట్లో తెలీకుండా జాగ్రత్త పడుతూ ఫ్యామిలీ ని మరో ఊరుకి షిఫ్ట్ చేస్తాడు.అక్కడ సూపర్ మార్కెట్లో సూపర్ వైజర్‌గా పని చేస్తుంటాడు. మరో వైపు వర్మను చంపిన వాడి కోసం దిలీప్ (సూరజ్ వెంజరమూడు) వెతుకుతుంటాడు. మిస్ అయిన మూడు కంటైనర్ల గురించి పై నుంచి బాస్ బోధి కల్పక్ (ఎస్ జే సూర్య) ఒత్తిడి కూడా దిలీప్ మీద ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ క్రమంలో ముత్తు ఓ చిన్న గొడవతో మూర్తి (నమో నారాయణ) వద్ద డ్రైవర్‌గా చేరాల్సి వస్తుంది. ఆ తర్వాత విగ్రహాల స్మగ్లింగ్ బిజినెస్‌లోకి మూర్తిని లాగుతాడు ముత్తు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ముత్తుని దిలీప్ కనిపెడతాడా?అసలు కొడుకుని చంపిన విషయంలో ఇంట్లో భార్యకి, కోడలికి, మనవడికి తెలిస్తుందా? అన్నదే చాల సింపుల్ కథ. నెల్సన్ ‘కధనం అద్భుతంగ నడిపాడు. ఈ సినిమా ఎక్కడా కూడా కొత్తగా అనిపించకపోవచ్చు. కానీ హీరో రజనీకాంత్ ని ఎలా బిజియం తో హైప్ చేసుకొంటూ వెళ్ళాలి.. ఎక్కడ విజిల్స్ వేయించాలి.అన్న విషయంలో నెల్సన్ వంద శాతం సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీతోనే నడిపించాడు.మున్సిపల్ ఆఫీసర్‌తో చిన్న గొడవ కథలో ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఇక హోటల్లో కాల్పుల మోతతో పీక్స్‌కి వెళ్తుంది. ఇక రజనీకాంత్ చొక్కా నలగకుండా లుక్స్ తో నటించాడు. సెకండాఫ్ ఆరంభంలోనే ఎస్ జే సూర్య పాత్ర ఎంట్రీ, అతని రేంజ్ చూపించే సీన్ ఇలా అన్నీ బాగుంటాయి. విద్యా బాలన్ రజినీ ట్రాక్ అదిరిపోతాయి. ఇక ప్రత్యక పాత్రలో హుట్రిక్ రోషన్ , మిథున్ చక్రవర్తి, విద్యా బాలన్, నమో నారాయణ, యోగి బాబు ఇలా అందరూ తమ తమ పాత్రల్లో మెప్పిస్తారు. రమ్యకృష్ణకి స్క్రీన్ స్పేస్ తక్కువగానే ఉంటుంది. మొత్తానికి సెకండ్ హాఫ్ కాస్త వీక్ అయిన సినిమా బాగుంది.
