సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ధర్మాన్ని అణచివేస్తే ఆక్రోశం పుడుతుంది. దానితో తిరుగుబాటు వస్తుంది. ‘జన్ జి’ యువత అదే చేస్తుంది. అవసరమైతే నేను కూడా ఒక ‘బొద్దింక’ గా మారతా అని ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ గతంలో కాక్రోచ్ జనతాపార్టీ కి మద్దతుగా పలికిన మాటలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఇటీవల జాతీయ ఎన్నికల కమిషర్ ఓటు చోరీ చేశారన్న ఆరోపణలఫై రాజీనామా కోరుతూ దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ ఆందోళనలలో పాల్గొన్న ఇద్దరు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు కోర్టు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వీరి అరెస్ట్ అంశంపై వైఎస్ జగన్ మరోసారి స్పందించారు. వారిని అరెస్ట్ చేయడం సరికాదని వ్యవస్థలోని లోపాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించాలని. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా అరెస్ట్ అందుకు పరిష్కారం కాదు. ఇది పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది’ అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చెయ్యడం గమనార్హం. తమకు పార్టీ నేతల అరెస్ట్ను వ్యతిరేకిస్తూ ఘాటుగా స్పందించిన మాజీ సీఎం జగన్కు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ధన్యవాదాలు తెలిపారు. సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల అక్రమ అరెస్ట్లను వ్యతిరేకిస్తూ మద్దతు తెలిపినందుకు.. అలాగే అభిజిత్ వైఎస్ జగన్ పోస్టును రీ పోర్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
