సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఒక సంచలన కేసు నమోదు అయ్యింది. పరమ పవిత్రమైన భద్రాద్రి శ్రీ రామాలయ ప్రధాన అర్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులుపై ఆయన కోడలు తన మామ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ.. తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఆయనపై లైంగిక వేధింపుల కేసు గత ఆగస్టు 14న నమోదైనప్పటికీ ఆమె ఆరోపణల్లో అసలు నిజం ఎంత ఉందొ? కానీ .. కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. 2019లో ఆమెకు సీతారామానుజాచార్యులు కుమారుడు వెంకట సీతారామ్‌తో వివాహం జరిగింది. తన మామ తనను లైంగికంగా వేధించారని… ఆయన గురించి అత్తకు, భర్తకు చెప్పినా పట్టించుకోకపోగా తననే చిత్రహింసలు పెట్టారని పేర్కొన్నారు. రూ.10 లక్షల కట్నం తేవాలంటూ అత్త, ముగ్గురు ఆడపడుచులు, రెండో ఆడపడుచు భర్త, మూడో ఆడపడుచు భర్త తనను వేధిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు వీరందరిపైనా కేసు నమోదు చేసిన దృష్ట్యా దేవస్థానం ప్రధాన అర్చకుడు సీతారామానుజా చార్యులుపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన కుమారుడు సీతారామంని కూడా సస్పెండ్ చేస్తూ భద్రాద్రి దేవస్థానం ఈవో ఎల్. రమాదేవి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. విచారణలో అసలు వాస్తవాలు వెల్లడి కావాల్సి ఉంది.
