సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది.. భక్తుల సౌలభ్యం కోసం ముఖ్యమైన ప్రాంతాలలో సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెప్టెంబర్ 15వ తేదీ నుంచి తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన బందోబస్తు, మాడవీధులు, ఇతర ప్రాంతాల్లో బ్యారికేడింగ్ వంటి ఏర్పాట్లు చేస్తున్నట్లు, శ్రీవారిని దర్శించుకుని, వాహన సేవలను ఆనందంగా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ సీవీఎస్‌వో మురళీకృష్ణ తెలిపారు. ధ్వజారోహణం రోజున సీఎం నారా చంద్రబాబు తిరుమలకు రానున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *