సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమలలో స్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్ల కోటాను నేటి బుధవారం (24-06-2026) ఉదయం 10.00 గంటలకు విడుదల చేసింది..తిరుపతిలో భక్తులు బస చేయడానికి అవసరమైన వసతి గదుల కోటాను కూడా నేటి మధ్యాహ్నం 3.00 గంటలకు ఆన్లైన్లో అందుబాటులోకి వస్తాయి.. కేవలం అధికారిక పోర్టల్ ద్వారానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలని భక్తులకు టీటీడీ స్పష్టం చేసింది.
