సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:పేద దేశం ఇరాన్ అమెరికా కు ఇచ్చిన షాక్ ప్రపంచ చరిత్రలో ప్రత్యేక స్తానం లో ఎప్పుడు ఉంటుంది. అమెరికా లోని అత్యధిక శాతం ప్రజలు మిత్ర దేశాలు కూడా ట్రంప్ కు జరిగిన గర్వ భంగానికి బహిరంగానే సంతోషిస్తున్నాయి. దీనికి తోడు తాజగా.. ఇరాన్‌తో ఘర్షణల నేపథ్యంలో ప్రెసిడెంట్ ట్రంప్ యొక్క సైనిక అధికారాలకు కత్తెర వేస్తూ అమెరికా సెనేట్ తీర్మానం ఆమోదించడం సంచలనమ్ రేపింది. దీనిపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సెనేటర్లు తీసుకున్న ఈ నిర్ణయం తన పనిని మరింత కష్టతరం చేసిందని, అంతేకాకుండా ఇది ప్రపంచంలోనే నంబర్ వన్ ఉగ్రవాద స్పాన్సర్ అయిన ఇరాన్‌కు సహాయం, ఓదార్పు అందించినట్లు అయిందని ఆయన మండిపడ్డారు. సెనేట్ ఓటింగ్‌లో తన సొంత పార్టీకి చెందిన నలుగురు సెనేటర్లు కూడా డెమోక్రాట్లతో చేతులు కలపడంపై ట్రంప్ తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. దీనిపై తన ‘ట్రూత్ సోషల్’ ప్లాట్ఫామ్లో ట్రంప్ వరుస పోస్ట్‌లు పెడుతూ సెనేట్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ‘చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ ప్రస్తుతం పూర్తిగా బలహీనపడింది. అమెరికా అడిగిన ప్రతిదానికీ ఒప్పుకునే స్థితికి వచ్చింది. దశాబ్దాల తర్వాత అమెరికాను, దేశ అధ్యక్షుడైన నన్ను చూసి ఇరాన్ గజగజలాడుతోంది. ఇలాంటి కీలక సమయంలో యూఎస్ సెనేట్ ఏమాత్రం సమయం కాని సమయంలో, అర్థం లేని ‘వార్ పవర్స్ యాక్ట్’ ఓటింగ్ పెట్టింది’ ఈ ఓటింగ్ ఫలితం చూసి ‘దీని అర్థం ఏంటి?’ అని ఇరాన్ ప్రతినిధులు తన అధికారులను అడుగుతున్నారని అని ట్రంప్ విమర్శించారు.
