సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గత వారం రోజులుగా కోస్తా ఆంధ్ర ప్రజలను, ముఖ్యముగా గోదావరి జిల్లాల ప్రజలనుఁ ఆందోళనకు గురి చేసిన అక్వాన్ తుఫాను ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో నేటి శుక్రవారం ఉదయం 7:30 నుంచి 8:30 గంటల మధ్య తీరం దాటింది. తీరం దాటే సమయంలో గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. తుఫాను ప్రభావం ఒరిస్సా ఫై ఎక్కువ ఉండగా ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసాయి. తెలంగాణలోనూ అక్కడక్కడ వర్షాలు కురిసే సూచనలున్నాయి. భీమవరం పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు అనుకుంటే నేటి ఉదయం నుండి భానుడు ప్రచండంగా చెలరేగిపోతున్నాడు అది ట్విస్ట్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *