సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మున్సిపాలిటీ ఎన్నికల్లో చైర్మెన్ మరియు కౌన్సిల్ అభ్యర్థులు నామినేషన్స్ ఉప సంహరణ పర్వము అనేక ట్విస్ట్ లతో ముగిసింది, ఏమి జరిగిందో? ఏమిటో? ఎవరు ఊహించని రీతిలో 4వార్డులలో సీనియర్ వైసీపీ అభ్యర్థులు తమ నామినేషన్స్ ఉప సంహరించుకోవడంతో పట్టణంలో నాలుగు వార్డులకు కూటమి కి చెందిన కౌన్సిలర్ అభ్యర్థులు బీజేపీకి చెందిన ఇద్దరు, టీడీపీకి చెందిన ఒకరు, జనసేనకు చెందిన ఒకరు ఏకగ్రీవం అయ్యారు. వారు: బీజేపీ – 9వ వార్డు: కలిదిండి వినోద్ వర్మ, బీజేపీ – 4వ వార్డు: పేరూరి ప్రకాష్, టీడీపీ – 37వ వార్డు: పొత్తూరి బాపిరాజు జనసేన – 2వ వార్డు: తోట లీలా మాధురి ఇప్పటికే ఏకగ్రీవం అయ్యారు. ఇక పట్టణంలో ఉన్న మొత్తం 52 వార్డులలో 4ఏకగ్రీవం కాగా మిగిలిన 48 వార్డులలో వైసీపీ పార్టీ, 23వార్డులలో టీడీపీ, 21 వార్డులలో జనసేన, 4 వార్డులలో బీజేపీ బరిలో ఉంది. అయితే ఏకగ్రీవం కలపి బీజేపీ 6 వార్డులలో పోటీ చేసి చూపింది. రాజ్య సభ సభ్యుడు పాక సత్యనారాయణ తనయుడు ఇండిపెండెంట్ గా ఇంకా బరిలో ఉన్నారు.. అంటే పరోక్షంగా బీజేపీకి 7 స్థానాలు వచ్చినట్లే..? వైసీపీ కి చెందిన మరో ఇద్దరు అభ్యర్థులు నామినేషన్స్ విత్ డ్రా చేసినట్లు ప్రచారం జరిగిన, అది నిజం కాదని ఎన్నికల అధికారులు ధ్రువీకరించారు.
