సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2016 జనవరి 30న తుని లో ‘కాపు నాడు సభ’ సమయంలో రత్నాచల్ రైలు దగ్ధం ఘటన జరిగింది. కాపులకు రిజర్వేషన్ల డిమాండ్‌తో కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో ‘కాపు నాడు సభ’ జరిగింది. ఆ నేపథ్యంలో తూ. గో జిల్లాలో కీలక కాపు నేతలపై ఎన్నో కేసులు నమోదులు, అరెస్టులు జరిగాయి. కాపు ఆందోళనలు జరిగాయి. వాటిలో చాల కేసులు జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఎత్తివేసింది. అయితే తాజగా కీలకమైన ‘తుని రైలు దగ్ధం కేసు’ను కూడా నేడు, సోమవారం విజయవాడ రైల్వే కోర్ట్ కొట్టివేసింది. ముగ్గురు ఆర్‌పీఎఫ్ పోలీసులు విచారణ సరిగా చేయలేదని కోర్ట్ తప్పుబట్టింది. బాధ్యులైన ముగ్గురిపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ముద్రగడ పద్మనాభం, మంత్రి దాడిశెట్టి రాజాలపై కేసు కొట్టివేసింది. ఆధారాలు లేని కారణంగా మొత్తం 41 మందిపై కేసులను కొట్టివేసింది. సున్నితమైన అంశాన్ని ఐదేళ్లపాటు ఎందుకు సాగదీశారని పోలీసులను కోర్ట్ ప్రశ్నించింది. పోలీసు అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని కోర్ట్ కోరింది.దగ్ధమైన రైలులో అంతమంది ప్రయాణిస్తే కేవలం ఒక్కరిని మాత్రమే ప్రశ్నించడం ఏమిటని కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *