సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మురసు తుఫాన్ ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొనివస్తున్న వేళా.. నేటి సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము మధ్య ఒంగోలు సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. మురసు తుఫాన్ ప్రభావంతో విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్ల సర్వీసులను రద్దు చేసారు. నేడు సోమ, రేపు మంగళవారాల్లో నడవాల్సిన తొమ్మిది రైళ్ల సర్వీసులను నిలిపివేసింది.వీటిలో విజయవాడ-గూడూరు, గూడూరు-విజయవాడ, గుంటూరు-తెనాలి, తెనాలి-గుంటూరు రైళ్లు ఉన్నాయి. అలాగే, సోమవారం నడవాల్సిన తెనాలి-రేపల్లె రైలు సర్వీసును కూడా రద్దు చేశారు. మరోవైపు, మంగళవారం నడవాల్సిన రేపల్లె-మార్కాపురం రోడ్, మార్కాపురం రోడ్-రేపల్లె రైలు సర్వీసులనూ రద్దు చేశారు. తుఫాన్ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా రైల్వే శాఖ ముందస్తు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. .
