సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతుండటంతో నేడు, ఈవారం దేశీయ స్టాక్ మార్కెట్ ప్రారంభము నుండి (నవంబర్ 2) మంచి జోష్ తో కొనుగోళ్ల మద్దతుతో భారీ లాభాల్లోకి దూసుకొని వెళ్ళింది. ఇటీవల విడుదలైన పండుగ సీజన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL), ఆటోమొబైల్ విక్రయ గణాంకాలు, టాటా స్టీల్ వంటి కీలక రంగాల్లో కొనుగోళ్ల జోరు మార్కెట్లకు బలమైన ఊతాన్నిచ్చింది , గత వారం ముగింపు 74,459.53 తో పోలిస్తే సెన్సెక్స్ నేటి ఉదయం 75,178.24 వద్ద బలమైన పాయింట్లతో ప్రారంభమైంది. అనంతరం మరింత పుంజుకుని 1,002.43 పాయింట్లు (1.35%) ఎగబాకి 75,461.96 వద్ద లాభాల్లో కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ గత ముగింపు 23,053.10 తో పోలిస్తే ఉదయం 23,222.30 వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆ తర్వాత కొనుగోళ్ల పట్టుతో 285.35 పాయింట్లు (1.24%) పెరిగి 23,338.45 వద్ద ట్రేడ్ అవుతోంది.
