సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం వరంగల్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ముందుగా భద్ర కాళీ ఆలయం లో అమ్మవారిని దర్శించుకొని తదుపరి, ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభ వేదికగా.. హనుమకొండలో రూ.6,109 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. రూ.521 కోట్లతో రైలు వ్యాగన్ల కర్మాగార నిర్మాణానికి, రూ.2,147 కోట్లతో జగిత్యాల-కరీంనగర్-వరంగల్ జాతీయరహదారి పనులకు, రూ.3,441 కోట్లతో మంచిర్యాల – వరంగల్ జాతీయరహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోడీ మాట్లాడుతూ.. దేశాభివృ ద్ధిలో తెలుగువారి ప్రతిభ కీలకంగా మారిందని ,దేశానికి ఇది స్వర్ణ సమయమని చెప్పారు. ‘ తెలంగాణలో శరవేగంగా హైవేలు, ఎక్స్ ప్రెస్వేలు, ఇండస్ట్రియల్-ఎకనామిక్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నాం, ఇక్కడ ప్రజలను వంచిస్తూ సీఎం కెసిఆర్ అవినీతి ఢిల్లీ వరకు పాకింది. అని ప్రధాని మోదీ విమర్శించారు. ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘ప్రపంచమే బాస్ గా గుర్తించిన నేత ప్రధాని మోదీ’ ఇక్కడ 10 వేల మంది వరకు ఉపాధి కలిపిస్తున్నారు వరంగల్ను స్మా ర్ట్ సిటీ చేసేందుకు మోదీ వచ్చా రు. ప్రధాని కార్యక్రమానికి వచ్చేం దుకు కేసీఆర్ కు ముఖం లేదు. మోదీ వస్తే కేసీఆర్కు కొవిడ్ వస్తుంది.. జ్వరం వస్తుంది’’ త్వరలో తెలంగాణాలో ప్రజలు బీఆర్ ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల దుకాణం బంద్ చేసి బీజేపీ కి పట్టం కడతారని అని బండి సంజయ్ విమర్శించారు.
