సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: తెలుగు శాటిలైట్ టివి చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో గ్రాండ్ ఫినాలేను ప్లాన్ చేస్తున్నారు తెలుగు బిగ్‌బాస్ నిర్వాహకులు. ఈ సారి ముఖ్య అతిథులుగా బాలీవుడ్ స్టార్ల మీద కూడా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే బాలీవుడ్ జంట రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకునే స్పెషల్ గెస్టులుగా రానున్నారని ప్రచారం జరిగింది. అలాగే ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ నుంచి రాజమౌళి, రామ్‌చరణ్, అలియా భట్ కూడా ఉంటారని సమాచారం. మరి నేటి ఆదివారం రాత్రి ఎవరు ఎంతగా సందడి చేస్తారో వేచి చూడాలి.. ఇంకా మరో బోనస్ ఏమిటంటే.. బిగ్‌బాస్ తెలుగు రెండో సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన నేచురల్ స్టార్ నాని మరోసారి బిగ్‌బాస్ స్టేజీపై సందడి చేయనున్నాడట! ఆయనతో పాటు జగపతిబాబు., హీరోయిన్ సాయిపల్లవి, పుష్ప ప్రమోషన్ కోసం రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్, డైరెక్టర్ సుకుమార్, శ్యామ్ సింగ రాయ్ ప్రమోషన్స్ కోసం గ్రాండ్ ఫినాలేకు విచ్చేయనున్నట్లు సమాచారం. ఇక బిగ్ బాస్ సీజన్ కు సూపర్ హోస్ట్, నాగార్జున వీరందరిని ఎలా నెగ్గుకొనివచ్చి షో ని రక్తి కట్టిస్తాడో చూడాలి? ఇక బిగ్ బాస్ హౌస్ లో విన్నర్ గా అత్యధికులు అభిమానిస్తున్న సన్నీ విజేతగా అవతరిస్తే ? షణ్ముఖ్, సిరి జంట అసభ్య చేష్టలపై మక్కువ పెంచుకొని వారిని ఎనకేసుకొని వచ్చే నాగార్జున ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది? నేటి రాత్రి స్టార్ మా..లో చూడవలసిందే..
