సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల నాని మోహన్ బాబు కాంబినేషన్ లో వచ్చిన పారడైజ్ కలెక్షన్స్ మొదటి నాలుగు రోజులు అదరగొట్టిన తరువాత నెమ్మదించాయి. అయితే తెలంగాణ లో నో డౌట్ హిట్ సినిమాగా నిలబడింది. హిందీలో కూడా 10 కోట్ల కలెక్షన్ సాధించిన నాని మొదటి సినిమాగా రికార్డు సాధించింది. ఇక కొత్త సినిమాలు కోసం అందరి కళ్లూ అక్టోబర్ సినిమాలపై పడ్డాయి. దసరా సెలవులు ఉండటం, పెద్ద హీరోల సినిమాలు, ముఖ్యంగా వెంకటేష్ ఆదర్శ కుటుంబం ఫై పెద్ద అంచనాలు ఉన్నాయి. ఈసినిమా 9న రిలీజ్ కానుంది. ఎటువంటి ప్రీమియర్ షో లు లేవని త్రివిక్రమ్ ప్రకటించారు. ఇక విజయదేవరా కొండా రణబలి భారీ సినిమా కూడా రానుంది, ఇక రజనీకాంత్ హీరోగా జైలర్ 2 కూడా మంచి అంచనాలతో రానుంది.ఇక అక్టోబర్ మొదటి వారంలో ఏకంగా 9 మీడియం బడ్జెట్ సినిమాలు విడుదల అవుతున్నాయి. సందీప్ కిషన్ హీరోగా ‘సిగ్మా’.. ఎస్.ఎస్ రాజమౌళి సమర్పిస్తున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’.. కీర్తి సురేష్ ‘డోరతీ’ చిత్రాలు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ‘తెల్ల కాగితం’, ‘అనకాపల్లి’, సాయి కుమార్ తనయుడు ఆది హీరోగా ‘ఎస్ఐ యుగంధర్’ లాంటి సినిమాలు ఈ వారమే థియేటర్లలోకి వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *