సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో వర్షాకాలంలో వర్షాలు లేవు. వర్షాకాలం సీజన్ పూర్తీ అయ్యాక మాత్రం ఏపీలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో వరుసగా 2 తుపాన్ లతో సహా వర్షాలు పెనుగాలులు కోలుకోకుండా ప్రజలను దంచి కొడుతున్నాయి. నిన్న నేడు, శుక్రవారం కాస్త తెరిపి ఇచ్చింది. దీపావళి పండుగ కు పర్వాలేదని అందరు ఊపిరి తీసుకొంటున్నారు. ఇంతలో ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణశాఖ ప్రకటించింది. దీపావళి తర్వాత ఈ నెల 11న ఈ ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ ఉపరిత ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు స్పష్టం చేసింది.అయితే అల్పపీడనం బలపడుతుందా.. లేదా? అనేది వాతావరణశాఖ ఇంకా అంచనా వేయలేదు. మొత్తానికి ఈనెల 11 నుండి వర్షాలు పడతాయి.
