సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత స్టాక్ మార్కెట్లు నేడు , గురువారం (అక్టోబర్ 15, 2026) పెట్టుబడి దారులకు లాభాలతో నిజమైన దసరా సంబరాలు చూపించింది. గత కొన్ని రోజులుగా తీవ్ర అనిశ్చితి, అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న మార్కెట్లలో ఐటీ కంపెనీల అద్భుతమైన క్యూ2 ఫలితాలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడం వంటి సానుకూల పరిణామాలు మార్కెట్ వేగానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. నేడు, గురువారం మధ్యాహనానికి బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex): ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1,533 పాయింట్లకు పైగా (2.11%) ఎగబాకి ఇన్వెస్టర్లలో సరికొత్త జోష్ నింపింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty): నిఫ్టీ సైతం 1.66% పైగా లాభపడి, తిరిగి కీలకమైన 23,000 మార్కును విజయవంతంగా అధిగమించింది. నేటి ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ 22,931 పాయింట్ల స్థాయి దాటి ముందుకు సాగింది. HCL Tech రూ.12 డివిడెండ్ ప్రకటించడం సానుకూల ప్రభావం చూపింది.
