సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో ఖ్యాతి గాంచిన భీమవరం లోని శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ & డాక్టర్ బి.వి. రాజు ఫౌండేషన్ వ్యవస్థాపకులైన డాక్టర్ బి.వి. రాజు గారి జయంతి సందర్భంగా నేడు, భీమవరంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన విద్యాసముదాయాలలో నందు గల Dr. బి.వి. రాజు గారి సమాధి వద్ద శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు Dr. బి.వి. రాజు ఫౌండేషన్ కు చెందిన వివిధ కళాశాలల డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు నివాళులు అర్పించారు. విష్ణు క్యాంపస్ నందు పలువురు విద్యార్థులు రక్తదానం చేసారు. డాక్టర్ బి.వి. రాజు స్వగ్రామం అయినటువంటి కుందువల్లి గ్రామంలో వందలాది పేదవారికీ దుస్తులు, బియ్యం ఆపిల్ పండ్లు, బిస్కట్లు మరియు బ్రెడ్లు పంచినారు. ఫాదర్ FMLR సెంటరు, శృంగవృక్షం నందు లెప్రసీ రోగులకు భీమవరం St. మేరీస్ లెప్రసీ సెంటరు నందు లెప్రసీ రోగులకు భీమవరం 7 వ వార్డు నందు గల లెప్రసీ కాలనిలో లెప్రసీ రోగులకు పండ్లు, బిస్కట్లు మరియు బ్రెడ్లు మందులు పంపిణీ చేశారు.. స్థానిక Dr. బి.వి.రాజు మార్గ్ మరియు బి.వి. రాజు మునిసిపల్ పార్కు నందు గల బి.వి.రాజు గారి విగ్రహములకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు
