సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం సిపిఎం జిల్లా విస్తృత సమావేశం మెంటేవారితోట సుందరయ్య భవనంలో బి.వాసుదేవరావు అధ్యక్షతన జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్.వి గోపాలన్ మాట్లాడుతూ ..కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ కు 2000 లో శంకుస్థాపన చేసి 26 సంవత్సరాలు పూర్తయిందని 2007`10 నాటికి ఈ రైల్వే లైన్ వినియోగంలోకి రావాలని లక్ష్యం పెట్టుకున్న ఇంకా పూర్తి కాలేదని ఆయన అన్నారు. అపట్లో 2000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని లక్ష్యంగా పెట్టుకున్నారని విపరీతమైన జాప్యం వల్ల వ్యయం 4000 కోట్లకు పెరిగిపోయిందని అన్నారు. పనులు వేగవంతం చేసి పుష్కరాలు సమయానికి పూర్తిచేయాలని ఆయన కోరారు. ఇక బియ్యపు తిప్ప వద్ద షిప్పింగ్ హార్బర్ కు 2002లో శంకుస్థాపన చేశారని 2024 కి పూర్తి చేస్తామని చెప్పారని కానీ పనులు మధ్యలో ఆగిపోయాయని ఆయన అన్నారు.తక్షణం నిధులు విడుదల చేసి హార్బర్ ని పూర్తిచేయాలని ఆయన కోరారు ఆక్వా యూనివర్సిటీని నిర్మాణం ప్రారంభమై మధ్యలో నిలిచిపోయిందని అద్దె బిల్డింగ్ లో యూనివర్సిటీ క్లాసులు నిర్వహిస్తున్నారని నిర్మాణ పనులు పూర్తి చేసి ఆక్వా యూనివర్సిటీ భవనం లోనే నిర్వహించాలని ఆయన కోరారు. నర్సపురం, భీమవరం యితర పట్టణాలకు కంపోస్టు యార్డులు లేకపోవడం వల్ల ఎక్కడిచెత్త అక్కడే పేరుకుపోయి ప్రజలు అనారోగ్యానికి ఇబ్బందులకు గురౌతున్నారని తక్షణం కంపోస్టుయార్డ్‌లు ఏర్పాటుచేయాలని కోరారు. అంతేకాక కూటమి హామీల అమలుకావడం లేదని సూపర్‌సిక్స్ హామీలు అమలు చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *