సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎల్లుండి సెప్టెంబర్ 1వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం 9:45కు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో సీఎం బయలుదేరి . ఉదయం 10:30కు మొగల్తూరు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. సీఎంకు మొగల్తూరులో భీమవరం నర్సాపురం ప్రజాప్రతినిధులు, జిల్లా టీడీపీ నేతలు అధికారులు స్వాగతం పలకనున్నారు. మొగల్తూరు నుంచి రోడ్డు మార్గంలో నరసాపురానికి ముఖ్యమంత్రి ప్రయాణించనున్నారు. ఉదయం 11:05కు పొన్నపల్లిలో గోదావరి గట్టు వద్ద ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి నిర్వహించనున్నారు. నరసాపురంలో గోదావరి నదిలో బోట్ రైడ్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు మొగల్తూరు ప్రజావేదిక సమావేశానికి హాజరై ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కు మొగల్తూరులో టీడీపీ కేడర్ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరవుతారు. సాయంత్రం 4:35కు మొగల్తూరు నుంచి హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణం అవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *