సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు .. నేడు, శుక్రవారం కోనసీమతోపాటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకస్మిక పర్యటన నిర్వహించారు. నర్సాపురం మండలంలో నీట మునిగిన పొలాలను సందర్శించి, బాధిత రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. రైతన్నలు అధైర్యపడవద్దని పేర్కొన్నారు. తుఫాన్ నష్ట తీవ్రతను అంచనా వేసేందుకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ బృందం కూడా ఏపీలో పర్యటిస్తుందని ప్రకటించారు. నర్సాపురం, మొగల్తూరుల్లో ఏరియల్ సర్వే ద్వారా దెబ్బతిన్న పంటపొలాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. నర్సాపురం – పాలకొల్లు రోడ్డులోని కొత్త కాలనీ వద్ద, ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ వెళ్తుండగా ఖాళీ బిందెలతో మహిళలు నిల్చోని తమ నిరసన తెలుపగా.. మహిళలను చూసి సీఎం కారు దిగి సమస్యను అడిగి తెలుసుకున్నారు. తమ కాలనీలో మంచినీటి ఫైపు లైన్ ఏర్పాటుచేసి 25 ఏళ్లు గడిచిందని.. అయితే నేటికీ నీళ్లు లేవని మహిళలు తెలిపారు. తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించాలని సంబధిత అధికారులతో మాట్లాడి సీఎం చంద్రబాబు ఆ మహిళలకు హామీ ఇచ్చారు. పలువురు ప్రజలు తమకు 4 రోజులుగా విద్యుత్తూ సరఫరా లేదని వాపోయారు. మన అధికారులు తో పాటు తేలంగాణ ప్రభుత్వ సహకారంతో వారి విద్యుతు ఉద్యోగుల సహకారంతో అన్ని ప్రాంతాలలో కరెంట్ సరఫరా పునరుద్ధరిస్తున్నామని కంగారు పడవద్దని హామీ ఇచ్చారు.
