సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రష్యా ఉక్రెయిన్ యుద్ధం అమెరికా చొరవతో వచ్చే నవంబర్ 2వ వారంలోగ ముగుస్తుందని సమాచారం రావడంతో .. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. భారత దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న గురువారం సెన్సెక్స్ 905.01 పాయింట్ల (1.24 శాతం) వృద్ధి, నిఫ్టీ 237.90 పాయింట్లు (1.05 శాతం) కొనసాగిన లాభాల ర్యాలీ నేడు, శుక్రవారం కూడా కొనసాగింది. .నేడు శుక్రవారం (అక్టోబర్ 30, 2026) వారాంతపు ట్రేడింగ్‌లో లాభాలతో ముగిశాయి.• సెన్సెక్స్ (Sensex): 308.49 పాయింట్లు (0.42%) లాభపడి 74,459.53 వద్ద ముగిసింది. నిఫ్టీ (Nifty): 116.35 పాయింట్లు (0.51%) లాభపడి 23,053.10 వద్ద ముగిసింది. ఐటీ (IT) మరియు ఫార్మాస్యూటికల్స్ షేర్లలో బలమైన కొనుగోళ్లు మార్కెట్‌ను పైకి నడిపించాయి. ఆసియా మార్కెట్ల నుంచి నెగటివ్ సంకేతాలు ఉన్నప్పటికీ, లార్జ్ క్యాప్ షేర్ల మద్దతుతో సూచీలు వరుసగా రెండో రోజు లాభాల్లో నిలిచాయి.
