సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశీయ స్టాక్ మార్కెట్ నేడు, బుధవారం భారీ లాభాలు ఆర్జించింది. మొన్న సోమవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు నేడు బుధవారం బాగా కోలుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,502 పాయింట్లు పెరిగి 83,938 పాయింట్ల వద్దకు చేరుకొంది. . నిఫ్టీ 50 సైతం భారీ లాభాలతో 25,800 పాయింట్ల టచ్ చేసింది. నేడు, ట్రేడింగ్‌లో హెవీ వెయిట్ ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్ అయిన హిందుస్థాన్ యూనిలివర్ షేర్లు దాదాపు 6 శాతం పెరిగాయి. ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ వంటి హెవీ వెయిట్ షేర్లు లాభాలు ఆర్జించడం కూడా మార్కెట్ ర్యాలీకి తోడ్పడింది. ప్రముఖ బ్యాంకులు, ఐటీ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు బాగా పెరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *