సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాలకొల్లు ఎమ్మెల్యే గా వరుసగా 3వసారి గెలచి మంత్రిగా మారిన నిమ్మల రామానాయుడు ఏది చేసిన వినూత్నంగా ఆలోచిస్తారు..ఆయన ఆలోచనలు అమలు చేసే విధానం చూసేవారికి దిమ్మ తిరిగిపోతుంది. మరి నేటి సోమవారం ప్రారంభించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అదే తీరున మంత్రిగారు ప్రారంభించారు. లబ్దిదారులయిన వృద్దులు, దివ్యాంగుల కాళ్ళు కడిగి ప్రభుత్వ పెన్షన్ సొమ్ము‎ను పళ్లెంలో పెట్టి అందించారు మంత్రి నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో మంచం పట్టి ఉన్న పితాని సూర్యనారాయణ అనే లారీ డ్రైవర్‎కు మంత్రి తొలి పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల స్వయంగా సూర్యనారాయణ ఇంటికి వెళ్ళి ఆయన కాళ్ళను కడిగి పాదాలకు నమస్కరించారు. అనంతరం పెన్షన్ అందజేశారు. అలాగే ఇదే గ్రామంలోని పెదపాటి భాగ్యలక్ష్మి ఇంటికి కూడా మంత్రి నిమ్మల వెళ్లి ఆమె కాళ్ళను కడిగి నమస్కరించి పెన్షన్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు విడతల వారిగా కాకుండా ఒకేసారి పెన్షన్ సొమ్మును పెంచి తన మానవత్వాన్ని చాటుకున్నారని , ఇకపై సచివాలయ సిబ్బంది స్వయంగా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తుందని, . రాష్ట్రంలో మొత్తం 65 లక్షల 18 వేల మందికిపైగా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు నేడు ఒకటో తేదీ పింఛను అందని వారికి 2వ తేదీన కచ్చితంగా అందచేయాలనీ అధికారులకు ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *