సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజక వర్గ పరిధిలో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. నేడు శుక్రవారం భీమవరం నియోజక వర్గ స్థాయిలో వీరవాసరం మండల కేంద్రం తులసి ఫంక్షన్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( ప్రత్యేక పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ నియోజక వర్గ స్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపించడం జరుగుతుందన్నారు. అధికారులు పరిశీలించి నెల రోజుల్లోగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 17వ తేదిన భీమవరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రజల నుండి వివిధ సమస్యలపై 150 అర్జీలు వచ్చాయన్నారు.
