సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేర పరిశోధనలో మన భీమవరం పోలీసులకు రాష్ట్ర స్థాయిలో ఎబిసిడి అవార్డు రావడం అభినంద నీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. అవార్డు అందుకున్న భీమవరం రెండో పట్టణ సిఐ కాళీచరణ్ ను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. ఎస్పీ, డిఎస్పీ, సిఐలకు కూడా ఎబిసిడి అవార్డు రావడం ఇవ్వడం గొప్ప విశేషమని, అత్యంత చాకచక్యంగా నేర పరిశోధనలు చేసి నేరస్థులను అదుపులోకి తీసుకోవడంలో సాహసం చేసినందుకు ఈ అవార్డులు వచ్చాయని అన్నారు. అవార్డులు అందుకున్న వారికీ ఎమ్మెల్యే అంజిబాబు అభినందనలు తెలిపారు.
