సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం నాగిడిపాలెం గ్రామ పరిధిలోని నాగేంద్రపురంలో నేడు, శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి, డా. గీతాబాయి పర్యవేక్షణలో, క్యాన్సర్ వ్యాధి నిర్దారణ కార్యక్రమము విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమములో స్పెషలిస్ట్ వైద్యులు డా.జీ.పద్మ (జనరల్ మెడిసిన్), డా.రామమహేశ్వరి ( జనరల్ సర్జన్), డా.ఎం. సుబ్బలక్ష్మి (స్త్రీల వైద్య నిపుణులు) హాజరయ్యి, 30 సం” పైబడిన స్త్రీ, పురుషులను పరీక్షించి, క్యాన్సర్ అనుమానితులను మరిన్ని పరీక్షలు చేసి, వ్యాధి నిర్ధారణ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఈ కార్యక్రమములో డి.ఎం.హెచ్.ఓ.డా.గీతాబాయి, డి.పి.ఎం.ఓ. డా.ధనలక్ష్మి, సర్పంచ్ నాగిడి దుర్గా భవానీ, ఊరి పెద్ద నారాయణ స్వామి, వైద్యాధికారులు డా.దయామణి, డా.ఈశ్వర్ విద్యా సాగర్ మరియు సి.హెచ్.ఓ., ఎ.ఎన్.ఎం., ఆశా వర్కర్లు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *