సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారు ఆషాడ పౌర్ణమి సందర్భముగా నేడు, ఆదివారం ప్రజలు కు ఆయురారోగ్యాలు ప్రసాదించే పచ్చని పకృతి దేవత శాఖంబరి దేవిగా అలంకరణ లో దర్శనమిచ్చారు. దేవాలయంలో ఉప దేవాలయం శ్రీ వినాయక విగ్రహం మొదలుకొని శ్రీ అమ్మవారి దేవాలయం లో నలువీధుల ఎంతో శ్రమకు ఓర్చి ఎన్నో టన్నుల కూరగాయలు ఆకూ కూరలతో పండ్ల తో విభిన్న పుష్పాలతో చేసిన అలంకరణ నభూతో నభవిషత్ అన్న రీతిలో అలంకరించారు. ఇక పండ్లు పుష్పాలతో నిలువెత్తు శ్రీ అమ్మవారు అయితే వనదేవత ను తలపించారు. .సకల సుఖశాంతులు అందించే శాఖంబరి దేవిని వేలాదిగా భక్తులు విశేషంగా కుటుంబ సమేతంగా దర్శించుకొంటున్నారు. అందమైన అడవిని తలపించేలా తీర్చిద్దిన అలంకరణలతో ఉన్న ఆలయంలో విహరించడం ఒక ఆధ్యాత్మిక మధురానుభూతి ని మిగులుస్తుంది. నేడు, రేపు సోమవారం కూడా దర్శనాలు ఉంటాయి. మన సిగ్మా వెబ్ ఛానెల్ లో ఈ వీడియో వీక్షించవచ్చు.. . ఇప్పటికే వేలాది మంది భక్తులు వాట్స్ అప్ లో ఇతర సోషల్ మీడియా మాధ్యమాలలో వీక్షించారు.
