సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నేడు, బుధవారం భీమవరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. విస్సాకోడెరు వంతెన దగ్గర నుంచి ఎమ్మెల్యే కార్యాలయం వరకు జనసేన నాయకులు కార్యకర్తలు, వీర మహిళలతో బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు , జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ ..కేవలం ఒక హోదాగా పరిమితం కాకుండా ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించే సేవకుడిగా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో పాలనందిస్తున్నారని అన్నారు. సినిమా పరిశ్రమ నుండి ప్రజా నాయకుడిగా ఎదిగిన పవన్ కళ్యాణ్ ప్రస్థానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమన్నారు. సమాజ సేవలో నిరంతరం కొనసాగాలని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు.. పంచాయతీ రాజ్ శాఖలో అనేక సంస్కరణలు తెస్తున్నారనిఅన్నారు.. అనంతరం జియో పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఓవర్ బ్రిడ్జి, బుధవారం మార్కెట్ రోడ్, పోలీస్ బొమ్మ సెంటర్, ప్రకాశం చౌక్, అంబేడ్కర్ సెంటర్, బాంబే స్వీట్స్ సెంటర్, ఉండి రోడ్డు మీదుగా ఎమ్మెల్యే కార్యాలయం వరకు బైక్ ర్యాలీ పవన్ కళ్యాణ్ నినాదాలతో సాగింది. ఈ కార్యక్రమంలో జనసేన క్యాడర్ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
