సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: గుజరాతీలో కేవలం 50 లక్షల బడ్జెట్‌తో సినిమా తీస్తే తోలి 100 కోట్లు సాధించిన సినిమాగా సంచలన విజయం సాధించిన ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ మూవీ తెలుగు రీమేక్‌లో శ్రీకృష్ణుడి పాత్ర కోసం చరణ్‌తో చర్చలు జరుగుతున్నాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో వెంకటేష్ తో కల్సి పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల’లో చేసిన తరహా ‘మోడరన్ కృష్ణుడి‘ పాత్ర కావడం గమనార్హం. ఎంతో కస్టపడి ప్రాణం పెట్టి చేసిన ‘పెద్ది’ సినిమా ఆశించిన ఫలితం రాకపోవడంతో రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రారంభించలేదు.సుకుమార్ దర్శకత్వంలో ‘RC 17’ ఎప్పుడు? పట్టాలెక్కుతుందనేది క్లారిటీ లేదు. ఇటీవల చరణ్ చేతికి సర్జరీ జరగడంతో, కొద్దీ రోజులలో షూటింగ్ పూర్తీ చేసేలా, డాన్సులు పోరాటాలు లేకుండా ఈ గుజరాతి సినిమా తెలుగు రీమేక్ లో స్పెషల్ రోల్ వెయ్యడానికి రామ్ చరణ్ సిద్ధపడుతున్నట్లు సమాచారం. మరి హీరో పాత్రలో మీడియం రేంజ్ హీరో నటించే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన మరో 10 రోజులలో వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *